మాజీ సీఎం కేసీఆర్ తన మానవతను చాటుకున్నారు మరోసారి. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు. కిష్టయ్య కూతురు ప్రియాంక పీజీ వైద్య కోర్సు చేసేందుకు ఎంపికైంది. ఈ సందర్బంగా తగినంత ఆర్థిక స్తోమత లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు కేసీఆర్. ఇచ్చిన మాట ప్రకారం కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తయ్యేందుకు కేసీఆర్ సాయం చేశారు.