టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
NEWS May 19,2025 06:31 am
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భావించే తిరుమల పుణ్య క్షేత్రానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. భారీ ఎత్తున నగదుతో పాటు ఆభరణాలు, వజ్రాలు, విదేశీ కరెన్సీ సైతం భక్తులు సమర్పించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టులకు విరాళాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు వైజాగ్ లోని హిందూస్తాన్ అసోసియేట్స్ కు చెందిన మస్తాన్ రావు కుటుంబీకులు.