ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో చేతులెత్తేసింది. సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో మైదానంలోకి వచ్చినా గెలిపించ లేక పోయాడు. ఇక ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఇంకో మ్యాచ్ తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది పంజాబ్ కు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీ తోడైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 219 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 207 రన్స్ చేసింది. మరో ఓటమి మూటగట్టుకుంది.