అగ్నిప్రమాద ఘటనపై రాహుల్ , ఖర్గే దిగ్భ్రాంతి
NEWS May 18,2025 05:52 pm
గుల్జార్ హౌస్ ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే . ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నట్టు 'ఎక్స్' ద్వారా వెల్లడించారు. ఈ ఘటనపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.