జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
NEWS May 18,2025 05:32 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చి చెప్పారు ఎగ్జిబిటర్లు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు.