బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన కీలక లీగ్ మ్యాచ్ రద్దయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్ర వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు . చాలా సేపటి వరకు వేచి చూశారు. మ్యాచ్ ను నిర్వహించేందుకు ఎలాంటి ఆస్కారం లేక పోవడంతో గత్యంతరం లేక లీగ్ మ్యాచ్ ను నిర్వహించ లేమంటూ చేతులెత్తేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ను కేటాయించారు.