భక్త జనసందోహం తిరుమల పుణ్య క్షేత్రం
NEWS May 18,2025 08:49 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్త సందోహమే కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 87 వేల 347 మంది దర్శించుకున్నారు. 39 వేల 490 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు ప్రస్తుతం క్యూ లైన్ కొనసాగుతోందని, సర్వ దర్శనానికి కనీసం 24 గంటలకు పైగా పడుతుందని తెలిపారు.