వేద పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం
NEWS May 18,2025 08:37 am
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది టీటీడీ. శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండ నందు బోధింపబడు వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.