శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణపై ఈవో సమీక్ష
NEWS May 18,2025 08:14 am
శ్రీవాణి ట్రస్ట్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునః సమీక్షించుకుని మరింత మెరుగ్గా, సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా తయారు చేయాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఆలయాల నిర్మాణాలు పునాదుల్లాంటివని స్పష్టం చేశారు.