బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన చేశాడు. భారత జట్టు టెస్టు కెప్టెన్ గా స్టార్ బౌలర్ ముంబైకి చెందిన జస్ప్రీత్ బుమ్రాను నియమించినట్లు తెలిపాడు. తాజాగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు రోహిత్ శర్మ. టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించడంతో ఆయన స్థానంలో ఖాళీ అయిన కెప్టెన్సీ పదవికి బుమ్రా బెస్ట్ ఛాయిస్ అని ఎంపిక చేశామన్నాడు అగార్కర్. పరిశీలనలో పలు పేర్లు వచ్చాయని తెలిపాడు.