తమ పార్టీ మహిళా శక్తిని గౌరవిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు ఏం చేయగలరో చేసి చూపించారని ఆనాటి దివంగత పీఎం ఇందిరాగాంధీని గుర్తు చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.. రూ.5,200 కోట్లను మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చామన్నారు. ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందన్నారు.