నైరుతి రుతుపవనాల ప్రభావం
NEWS May 17,2025 09:08 am
రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదలడానికి అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.