ఆర్టీఐ కమిషనర్ గా మెర్ల వైష్ణవి
NEWS May 17,2025 08:53 am
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషనర్ గా మరొకరిని నియమించింది. ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ రామకృష్ణా రావు. ఇప్పటికే ఐదుగురిని నియమించింది. వారిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లుగా అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాసరావు, పర్వీన్, గోపాల్ తో పాటు తాజాగా వైష్ణవిని నియమించింది. అయితే ఆమె ఎవరు , అర్హతలు, అనుభవం ఏమిటనేది మాత్రం తెలియ పర్చలేదు సీఎస్.