మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్టు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, గిరిజనులను బెదిరించిన కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతో 7 వారాలకు పైగా పరారీలో ఉన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక టాప్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. కేసులు నమోదు చేసింది.