శ్రీవారికి బంగారు కఠి, వరద హస్తాలు విరాళం
NEWS May 16,2025 03:59 pm
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం భారీ బంగారు కానుక విరాళంగా అందింది. కలకత్తాకు చెందిన సంజీవ్ గోయెంకా రూ.3.63 కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను చేయించి స్వామి వారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జి గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.