మాజీ మంత్రి కేటీఆర్ హరీశ్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి చర్చించారు. ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యల పరిష్కారంపై ఎలా పోరాడాలనే దానిపై విస్తృతంగా చర్చకు వచ్చినట్టు టాక్.