బ్యాంకులకు టోపీ పెట్టి కోట్లాది రూపాయలతో ఉడాయించిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బిగ్ షాక్ తగిలింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దావా దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన లండన్ కోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం బ్యాంకులకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్నాడు తను. తనను తమకు అప్పగించాలని గత కొంత కాలం నుంచి భారత్ కోరుతోంది.