కాళేశ్వరంలో ఘనంగా సరస్వతీ పుష్కరాలు
NEWS May 15,2025 05:46 pm
తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మంత్రి డి. శ్రీధర్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.