లిక్కర్ స్కాం కేసులో సజ్జల విచారణ
NEWS May 15,2025 05:31 pm
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు . ఉ.9 నుంచి సా.5 గంటల వరకు తొలి రోజు విచారణ జరిగింది. మద్యం పాలసీ రూపకల్పన, డిస్లరీలకు అనుమతులు, సేల్స్ కు సంబంధించి ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. రాజ్ కసిరెడ్డి, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాను పని చేశానని చెప్పిన సజ్జల శ్రీధర్ రెడ్డి.రేపు, ఎల్లుండి కూడా కొనసాగనుంది విచారణ.
అనంతరం విజయవాడ జిల్లా జైలులో శ్రీధర్ రెడ్డిని అప్పగించారు.