సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకు పోయాయని ఆరోపించారు. బకాయిలు చెల్లించ లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయంటూ వాపోయారు. ఇప్పటికే ఎన్నో డ్రిగీ, ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. దీని కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ తక్షణమే నిధులు మంజూరు చేయాలన్నారు బండి.