కశ్మీర్ లో రక్షణ శాఖ మంత్రి టూర్
NEWS May 15,2025 01:57 pm
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం కశ్మీర్ లో పర్యటించారు. చీనార్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో రాజ్నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో భద్రతను సమీక్షించారు. అనంతరం భద్రతా బలగాలను కలిశారు. అంతకు ముందు ప్రధాని మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. యుద్ద మేఘాలు కమ్ముకున్న వేళ ఆర్మీ బలగాల్లో ఆత్మ స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.