భక్తులు కిటకిట కాసులు గలగల
NEWS May 15,2025 08:36 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 74 వేల 20 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 190 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా రూ. 3.27 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.