టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వసతి సేవలు అందజేస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రోగులతో ముచ్చటించారు. కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఇప్పటికే మాజీ టీటీడీ ఈవో ఐవీ సుబ్బా రావుతో ఎక్స్ పర్ట్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మూడు నెలల పాటు పూర్తిగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందని తెలిపారు. చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు బీఆర్ నాయుడు.