క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సిరిసిల్లకు చెందిన సాయి కిరణ్ క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. చికిత్స కోసం ఇంటిని అమ్ముకున్నా డబ్బులు సరిపోక పోవడంతో విషయం తెలుసుకున్న సీఎం వెంటనే రూ. 12 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడత రూ. 5 లక్షలు మంజూరు చేయగా తాజాగా మరో రూ. 7 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.