ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు మంజూరు
NEWS May 15,2025 07:51 am
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు, అంతర్ రాష్ట్ర నీటి సమస్యలపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి పెండింగ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా–గోదావరి జలాలపై సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ విచారణ పురోగతి, కాళేశ్వరంపై NDSA రిపోర్ట్, బ్యారేజీల పునః నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.