టీడీపీ నేత చౌదరి హత్య కేసులో 9 మంది అరెస్ట్
NEWS May 15,2025 07:44 am
ఏపీలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించారు పోలీసులు.ఈ హత్య కేసులో మొత్తం 12 మంది పాల్గొన్నారు. వీరిలో 9 మందిని అరెస్ట్ చేశామని, ఇంకా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే పట్టుకుని తీరుతామని ప్రకటించారు. తమ పార్టీ సీనియర్ నేతను దారుణంగా హత్య చేయడం పట్ల పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు.