కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుణ్య స్నానం చేశారు. ఇవాల్టి నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరుగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది సర్కార్. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరానికి చేరుకుంటారు. 10 అడుగుల సరస్వతీ దేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.