భూమి కంపించిందని జిల్లాలో బూరెల పండుగ
NEWS May 14,2025 05:27 pm
ఇటీవల జగిత్యాల జిల్లాలో భూమి కంపించింది. భూమాత శాంతించాలంటూ బూరెలు (భక్షాలు, బొబ్బట్లు) చెట్ల మొదల్ల వద్ద భూమిలో వేసి మంత్రోచ్ఛారణల క్రతువులతో పసుపు, కుంకుమలు సమర్పించి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భూమాతకు బూరెలంటే మక్కువని వాటిని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మ శాంతించి మరోసారి భూకంపం రాకుండా చూస్తుందని ప్రజల నమ్మకం.