ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు పారేసుకున్నాడు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిరనస వ్యక్తమైంది. దీనిపై జోక్యం చేసుకున్న హైకోర్టు సీరియస్ గా స్పందించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సోఫియా పై మత పరమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.