పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పొందారు. మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకుంటామన్నారు.