బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన ఎక్కడా తగ్గడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అవాకులు చెవాకులు పేలిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై పరోక్షంగా షాకింగ్స్ చేశారు. చిల్లరగాళ్ల గురించి తాను మాట్లాడితే బావుండదన్నాడు. కేరెక్టర్ లేని వాళ్లతో తనకు పోటీ లేదన్నారు. తాను ఎన్నడూ ఎవరి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నాడు. కేవలం ప్రజల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడానని స్పష్టం చేశారు.