భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ తమతో ఢీకొనలేక ఓడి పోయిందన్నారు. భారత్‌తో పోటీ పడే సత్తా లేదని పాక్‌కి అర్థమైందన్నారు. కశ్మీర్ విషయంలో మాకు చాలా క్లారిటీ ఉందన్నారు. ఉగ్రవాదులను అప్పగిస్తామంటే చర్చలు జరుపుతాం అన్నారు. అక్కడి నుంచి తూటా వస్తే.. తూటాతోనే సమాధానం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. పాక్ ఎయిర్‌బేస్‌లపై దాడులే టర్నింగ్ పాయింట్ అన్నారు. తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు మోదీ.