భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ పై మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందన్నారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామని వార్నింగ్ ఇచ్చారు.. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించామన్నారు.