భారత్ తో కాల్పుల విరమణకు తాము సిద్దంగా ఉన్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధర్ ప్రకటించారు. ఇదే సమయంలో తాము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి మొదట పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తో మాట్లాడారు. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని తెలిపారు.