ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. సీపీఐ నారాయణపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. ఇండియాలో జీవించే అర్హత ఆయనకు లేదన్నారు. అక్కడి ప్రజలతో నారాయణ జీవించాలన్నారు. దేశంలో ఇంత ఘోరం జరిగితే యుద్ధం వద్దంటాడా అని ప్రశ్నించారు. యుద్ధం చేయాలని దేశ ప్రజలంతా ఆవేశంతో ఉంటే ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు. నారాయణను సీపీఐ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.