మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు పవన్ వేతనం నుంచి ఒక్కో చిన్నారికి నెలకు రూ. 5 వేల చొప్పున సాయం చేశారు. ఇకపై ప్రతి నెలా అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే పంపిణీ చేస్తామని తెలిపారు. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని ప్రకటించారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.