భారత్-పాక్ మధ్య హైటెన్షన్ నెలకొంది. ఈ సందర్బంగా ఇండియన్ ఆయిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది.దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధన సరఫరాలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవని పేర్కొంది. యుద్ధ భయంతో ప్రజలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్ల వద్దకు పెద్ద ఎత్తున వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.