పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్య పరమైన చర్చలు జరపడం లేదన్నారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి. పాక్ చర్యల వల్లే సింధు జల ఒప్పందాన్ని రద్దు చేశామన్నారు. ఇవాళ పాకిస్తాన్ చేస్తున్న దాడులు కవ్వింపు చర్యలేనన్నారు.. పాక్ దాడులకు ధీటైన జవాబిస్తున్నామని చెప్పారు.. పాక్ కవ్వింపు చర్యలను తిప్పి కొడుతున్నామన్నారు.. పాక్ పుట్టుకతోనే అబద్ధాలు పుట్టాయి.ఐక్యరాజ సమితికి కూడా పాక్ అబద్ధాలు చెబుతోందన్నారు. పాకిస్థాన్‌లో ఉన్న టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని ప్రకటించారు.. పహల్గాం దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ రెండుసార్లు ప్రకటించుకుందన్నారు.. టీఆర్ఎఫ్‌ను ఐక్యరాజ సమితి నిషేధించాలని చూస్తే పాక్ అడ్డుకుందని ఆరోపించారు.