లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది భారత్. ప్రతీకార దాడులకు ప్రయత్నించిన దాయాది దేశానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. పాక్ మిస్సైల్స్‌ను గగనతలంలోనే పేల్చేసింది. మరో వైపు కరాచీ స్టేడియం వద్ద డ్రోన్ కలకలం రేపింది. దీంతో పాకిస్తాన్ పౌరులు భయంతో పరుగులు తీశారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.