దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినా లేదా దాడులకు తెగబడినా తాము ఊరుకునేది లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పటితో ఆగేది లేదన్నారు. ఇది కంటిన్యూగా కొనసాగుతుందన్నారు. దాడులకు ప్రతిదాడులు తప్పవన్నారు. మరిన్ని సైనిక దాడులకు సిద్దంగా ఉన్నామన్నారు. పీవోకేలో ఉగ్రవాదులను వేటాడుతున్నామని చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని తీరుతామని మట్టు పెడతామన్నారు.