ఓ వైపు భారత్ మరో వైపు బలూచిస్తాన్ ఆర్మీ దాడుల దెబ్బకు పాకిస్తాన్ విల విల లాడుతోంది. లాహోర్ తర్వాత కరాచీలో అటాక్ జరిగింది. ఐదు చోట్ల దాడులు జరిగినట్లు సమాచారం. డ్రోన్ అటాక్ జరిగినట్లు పాకిస్తాన్ మీడియా ప్రసారం చేసింది. పేలుళ్ల శబ్దం రావడంతో పాకిస్తాన్ పౌరులు పరుగులు తీశారు. ఇదిలా ఉండగా ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు.