భారత్ పై నిప్పులు చెరిగారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఆపరేషన్ సింధూర్ పై మండిపడ్డారు. భారత్ తీసుకున్న నిర్ణయం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్‌కు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన సాయుధ దళాలకు దేశం సెల్యూట్ చేస్తుందన్నారు షెహబాజ్.