బెట్టింగ్ యాప్లను బ్యాన్ చెయ్యొద్దు
NEWS May 08,2025 04:58 am
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేశ్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధం విధించవద్దంటూ కోరారు. మరో వైపు ఈ యాప్ ల కారణంగా ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా జయేష్ రంజన్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు చేసింది ప్రభుత్వం. యాప్ లను బ్యాన్ చేయడం పరిష్కారం కాదన్నారు జయేష్ రంజన్.