పంటలు కోల్పోయిన వారికి సర్కార్ భరోసా
NEWS May 06,2025 04:08 pm
ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంటలు నష్టపోయారు. పిడుగుపాటుకు గురై పది మంది మరణించగా, పశువులు కూడా మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. అలాగే, పిడుగుపాటు కారణంగా మృతి చెందిన పది మంది కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు.