కర్మాగారాల్లో జరుగుతున్న ప్రమాదాలపై నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి వాసం శెట్టి సుభాష్. సచివాలయంలో కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు చూచనలు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ఆడిట్ సరిగ్గా జరగక పోవడం కూడా మరో కారణమన్నారు. ప్రమాదాలు, కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా ఇన్స్పెక్షన్లు కర్మాగారాలలో రెగ్యులర్ గా చేపట్టాలన్నారు.