ఆర్టీసీ జేఏసీ సమ్మె వాయిదా
NEWS May 06,2025 03:38 pm
తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని, కోరిన కోర్కెలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులపై వేధింపులు ఉండవని, తీసి వేసిన వారిని తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంత సమయం ఇవ్వాలని కోరడంతో తాము సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.