పెద్దపల్లి మండలం సబితం గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 వాహనంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు వాపోతున్నారు.