సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ వివరాలు ఇవ్వాలి
NEWS May 06,2025 11:34 am
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాను ప్రభావితం చేసే వారిని, ప్లాట్ ఫామ్ లను గుర్తించాలని ఆదేశించింది కేంద్ర సర్కార్. ఈ మేరకు కీలక సూచనలు చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ . IT చట్టం 2021 డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ కింద దేశ వ్యతిరేక చర్యలకు, హింసను ప్రేరేపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం,తీసుకున్న చర్యలపై ప్రణాళికలను సమర్పించాలని కోరింది. ఈనెల 8వ తేదీ లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.