ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ను సీజ్ చెయ్యాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకట్ అన్నారు. విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్ముతున్న విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు ఆలమూరు సమత కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు వెంకట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.