రాష్ట్రాభివృద్దిపై చంద్రబాబు ఫోకస్
NEWS May 05,2025 04:24 pm
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.